
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘అమ్మ పేరిట ఓ మొక్క’ను నాటాలన్న పిలుపు స్లొవేకియాలోనూ ప్రతిధ్వనించింది. తమ దేశంలోనూ మోదీ పేర్కొన్న మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని ప్రకటించారు. స్లొవేకియాలోని పురాతన నగరం నిత్రాలో గురువారం మొక్క నాటే కార్యక్రమం సందర్భంగా భారత్‌లో ‘మోదీ పిలుపు’ను పెలెగ్రినికి ఆ దేశ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వివరించారు. మధ్య ఐరోపా దేశం స్లొవేకియాలో మనదేశానికి చెందిన టాటా మోటార్స్ జేఎల్‌ఆర్ ప్లాంట్ నిత్రాలోనే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కర్మాగారంలో పర్యటించిన అనంతరం అక్కడి స్థానిక పార్కులో పెలెగ్రిని, ముర్ము స్లొవేకియా జాతీయ వృక్షం లిండెన్ మొక్కను నాటిన సందర్భంగా భారత్‌లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముర్ము..పెలెగ్రినికి తెలిపారు. గతేడాది ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా ప్రతి ఒక్కరు తమ తల్లి పేరిట ఓ మొక్కను నాటాలని పిలుపిచ్చారు.
పోర్చుగల్, స్లొవేకియాల్లో రెండేసి రోజుల చొప్పున అధికార పర్యటనలు చేపట్టిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వాటిని ముగించుకుని భారత్‌కు చేరుకున్నారు.





