NewsProgramms

సమతా సందేశాన్ని చాటుతున్న కార్తీక వన భోజనాలు.

209views

మాజంలో సమరసతను పెంపొందించుటకు సనాతన ధర్మం  నిర్దేశించిన అనేక ధార్మిక కార్యక్రమాల్లో అతి పవిత్రమైన కార్తీకమాసములో జరిగే సామూహిక భోజనం కార్యక్రమమే వన భోజనం. వనాల ప్రాధాన్యతను తెలియ జేయుటకే అది వన భోజనమైంది.

వర్ష ఋతువులో వచ్చే అనేక వ్యాధులను తట్టుకునే విధంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించే సీ విటమిన్ అధికంగా ఉండే ఉసిరి చెట్టును పూజించడం ఇందులో భాగం. ఆదివారం కర్నూలు జిల్లా నంద్యాల ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో హిందూ వనభోజనం కార్యక్రమం జరిగింది.

రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కార్తీక వన భోజనాలు కోలాహలంగా, ఆనందోత్సాహాల మధ్య జరుగుతూ ప్రపంచానికి సమతా సందేశాన్ని అందిస్తున్నాయి.

నంద్యాలలో…

నంద్యాల చుట్టూ కొలువై ఉన్న నవనందులలో ఒకటైన ప్రముఖ శైవ క్షేత్రం  సూర్యనంది లో ఈ కార్యక్రమం జరగడం విశేషం.నంద్యాల పరిసర ప్రాంతాలనుండి 180 మంది హిందూ బంధువులు సదరు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో  మహానంది SI ప్రవీణ్ గారు ,మహానంది MRO జనార్దన్ గుప్తా గారు, సూర్యనoది చైర్మన్ సాగేశ్వర్రెడ్డి గారు,కర్నూల్ విభాగ్ ధర్మజాగరణ ప్రముక్ రాంప్రసాద్ గారు, హాథినాయక్ గారు,శంకర్ నాయక్ గారు,వాసు గారు, సురేష్ గారు,మధుసూదన్ గారు,Dr.అనిల్ కుమార్ గారు,Dr. సహదేవుడు గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అందరికి రామాయణ భాగవత గ్రంథాలు, కార్తిక పురాణం లాంటి ఆధ్యాత్మిక పుస్తకాలు వితరణ చేయటం  జరిగింది. ఉదయం అల్పాహారం తో మొదలైన కార్యక్రమాలు రోజంతా చిన్నా పెద్దా తేడా మరిచి ఆనందోల్లాసాల మద్య సాయంత్రం వరకు ఆటపాటలతో సాగాయి. ప్రతి కార్యక్రమంలో సనాతనధర్మ, ఆధ్యాత్మిక పరిమళాలు  గుభాలించినవి. బాబూ రావు దంపతులు సాంప్రదాయ దుస్తులతో పాల్గొని సదరు కార్యక్రమంలో తమ ప్రత్యేకతను చాటారు.

నెల్లూరులో…

ఇసుకతో శివ లింగాన్ని చేసి….

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం రామాపురం గిరిజన కాలనీలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కొంత మంది శివ మాలలు ధరించారు. వారు చేసే పూజలు, భజనలతో గ్రామంలో ప్రతి రోజూ పండుగ వాతావరణం ఏర్పడుతోంది. కోటి సోమవారాన్ని పురస్కరించుకుని శివ మాలలు ధరించిన వారి కుటుంబాల వారూ, కొందరు ఇతర గ్రామస్తులూ కలిసి సమీపంలోని మైపాడు బీచ్ వద్ద గల ప్రముఖ శివాలయం చేరుకున్నారు. అక్కడ ఆలయంలో గల శివలింగం వద్ద కార్తీక దీపాలు వెలిగించారు.  అలాగే సముద్రపు ఒడ్డున ఇసుకలో ఒక సైకత శివ లింగాన్ని స్వయంగా తయారు చేసి ఆ తాత్కాలిక శివ లింగానికి  అత్యంత  భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. వీరి కారణంగా వారు నివసిస్తున్న గిరిజన కాలనీలోనే కాకుండా చుట్టుపక్కల 2,3 గ్రామాలలో కూడా మార్పు వస్తోంది.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.