News

భద్రాచలం రామయ్యకు గోటి తలంబ్రాలు

373views

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని సఖినేటిపల్లి మండలం మోరి గ్రామం నుంచి ఏలూరి శివవెంకట సుబ్బారావు భద్రాచలం సీతారాముల కల్యాణానికి తలంబ్రాల బియ్యం సమర్పణ యాత్ర చేపట్టారు. దీనిలో భాగంగా ప్రత్యేకంగా తలంబ్రాల బియ్యం తయారు చేసుకుని ద్విచక్ర వాహనంపై ఉదయం మోరి గ్రామం నుంచి బయలుదేరారు. సాయంత్రం నాలుగు గంటలకు నిడదవోలు చేరుకున్నారు. గతంలో రామకోటి రాయించి పుస్తకాలు భద్రాచలం తీసుకెళ్లానన్నారు. శ్రీరాముడిపై ఉన్న భక్తితో తాను ఈ యాత్ర చేస్తున్నట్లు చెప్పారు.