News

హిందువుల ఐక్యత అవశ్యం

411views

ప్రస్తుత పరిస్థితుల్లో హిందువులంతా ఏకమైతేనే ఫలితం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రాంత కుటుంబ ప్రబోధన్ ప్రముఖ్ పుట్టాశేషు అన్నారు. ఆర్ఎన్ఎస్ శతవసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఇటీవల కడపజిల్లా, సింహాద్రిపురం జున్ను నారాయణరెడ్డి ఆయిల్ మిల్లో సింహాద్రిపురం ఖండ స్వయంసేవకులతో సభాకార్యక్రమం జరిగింది. అంతకుముందుగా సింహాద్రిపురం పురవీధుల గుండా స్వయంసేవకుల పథసంచలన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెంకటనాథరెడ్డి విచ్చేసారు. ఈ కార్యక్రమంలో 7 మండలాల నుండి 12 పంచాయతీలు, 218 మంది గణవేశ ధారి స్వయంసేవకులు, 260 మంది ఇతరులు 40 మంది మాతృమూర్తులు, మొత్తం 518 మంది పాల్గొన్నారు.