News

హవ్వ ఇదెక్కడి చోద్యం? దేవాలయ భూములను ఆక్రమించిన వారికే పట్టాలా?

861views

వేల ఎకరాల దేవాలయ భూమిని వాటి ఆక్రమణదారులకే అప్పగించేందుకు తమిళనాడు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనిపిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం ఆక్రమణదారులకు సహాయం చేస్తోందంటూ మద్రాసు హైకోర్టు ఇంతకు ముందు తమిళనాడు ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడింది. అయితే, విషయం హైకోర్టు పరిశీలనలో ఉన్నప్పటికీ, తమిళనాడు ప్రభుత్వం దేవాలయ భూములను వాటి ఆక్రమణదారులకే అప్పగించాలనే తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఒక నిర్ణీత కాల వ్యవధికి పైబడి దేవాలయ భూములను అక్రమంగా తమ స్వాధీనంలో ఉంచుకున్నవారికే పట్టాలు ఇవ్వాలని తాము నిర్ణయించామని తెలుపుతూ తమిళనాడు ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్ ప్రకారం, భూమి కోసం దేవాదాయ శాఖకు నష్టపరిహారం చెల్లించి ఒక నిర్ణీత కాల వ్యవధికి పైబడి దేవాలయ భూములను అక్రమంగా తమ స్వాధీనంలో ఉంచుకున్న కొందరు పేద కుటుంబాలకు  పట్టాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా అఫిడవిట్లో తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖ సహాయ కార్యదర్శి ఎస్. ఆనందన్ వేసిన ఈ కౌంటర్ అఫిడవిట్ లో తమిళనాడు ప్రభుత్వం “ఇది నిరర్ధకమైన ఉత్తర్వు కాదు. దేవాలయాల వారీగా ఆక్రమణకు గురైన భూముల వివరాలు, హిందూ ధార్మిక సంస్థలు మరియు దేవాదాయ శాఖ యొక్క అంగీకారం పొందాక అర్హులైన వారికి పట్టాలిచ్చేందుకు మేం నిర్ణయించాం” అని హైకోర్టుకు స్పష్టం చెయ్యడం ద్వారా ప్రభుత్వం దేవాలయ భూములను ఆక్రమణదారులకు అప్పగించాదానికి కృత నిశ్చయంతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.