News

దేశం కన్నా.. దేవుళ్ల కన్నా.. అధికార పార్టీ రంగులు, నేతలే మిన్నా?

702views

నంతపురం జిల్లాలో గ్రామ సచివాలయంపై ఉన్న జాతీయ జెండా రంగుల్ని మార్చి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. రెండ్రోజులుగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా కొనసాగుతోంది. దీనిపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తోపాటు అన్ని పార్టీలు, ప్రజలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. జాతీయ జెండా కన్నా వైసీపీ జెండా ఎక్కువైందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

నిన్న జాతీయజెండా..! నేడు వినాయకుడి విగ్రహం తొలగించి వైఎస్ విగ్రహమా?

ఈ వివాదం కొనసాగుతుండగానే వైసీపీ నేతలు మరో వివాదానికి తెరలేపారు. పశ్చిమగోదావరి జిల్లా పట్టిన్నపాళెం అనే గ్రామంలో వినాయకుడి విగ్రహాన్ని తొలగించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. దీంతో స్థానికులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీల నేతలు రంగంలోకి దిగి అధికార పార్టీ తీరుపై మండిపడుతున్నారు.
ఇప్పటికే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్రగీతమైన తెలుగుతల్లి గీతాన్ని ఆలపించడం ఆపేశారు. ఇకపై గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను కూడా తీసేసి వైఎస్ఆర్ విగ్రహాలు, రాజారెడ్డి విగ్రహాలు పెడతారేమో అని జనం బెంబేలెత్తిపోతున్నారు’ అంటూ వైసీపీ సర్కారు తీరుపై ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.

వినాయకుని విగ్రహం స్థానంలో ప్రతిష్టించటానికి తెచ్చిన YSR విగ్రహం

హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారా?

వినాయకుడి విగ్రహాన్ని తొలగించి వైఎస్సార్ విగ్రహం పెట్టాలనుకోవడం సరికాదని స్థానికులు అంటున్నారు. రంగంలోకి దిగిన బీజేపీ నేతలు వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి కంటే వైఎస్ ఎక్కువ కాదని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని అధికార పార్టీ నేతల్ని హెచ్చరించారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.