News

బీహార్ వరద బాధితులను ఆదుకున్న అక్షయ్ కుమార్

535views

బీహార్‌ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వరదల ధాటికి సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. ఒక్కో కుటుంబానికి రూ. 4 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇలా కోటి రూపాయలు 25 కుటుంబాలకు విరాళంగా ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నారు అక్షయ్ కుమార్. చాత్ పూజా సందర్భంగా అక్షయ్ కుమార్ సంతకం చేసిన చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేస్తామని అక్షయ్ కుమార్ కార్యాలయం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. సహజ విపత్తులు వచ్చాయంటే దానికి ఎవరూ ఏమీ చేయలేమని అక్షయ్ కుమార్ చెప్పారు. అయితే బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తాము ఏమి చేయగలమో అది చేస్తే వారికి ఊరట లభిస్తుందని చెప్పారు.
ఈ ఏడాది ప్రారంభంలో ఒడిషాలో ఫణి తుఫాను సృష్టించిన బీభత్సంపై కూడా ఈ హౌజ్‌ఫుల్ 4 యాక్టర్ స్పందించారు. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి విరాళం ఇచ్చి తన దాతృత్వాన్ని చాటారు. ఇది కాకుండా అక్షయ్ కుమార్ భారత్ కీ వీర్ అనే కార్యక్రమం ద్వారా భారత బలగాలకు తన వంతు సహాయం చేశారు. ఇక చెన్నై కేరళలో కురిసిన భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన వారికి అండగా నిలిచారు. పేద ప్రజలను ఆదుకోవడంలో కానీ, విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలవడంలో కానీ అక్షయ్ కుమార్ ముందువరసలో ఉంటారనేదానికి తాజాగా తాను ఇచ్చిన విరాళమే నిదర్శనం.
మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.