News

టపాసులు కాల్చాడని వ్యక్తి హత్య.

1.57Kviews

డిశా రాష్ట్రంలో టపాసులు కాల్చాడని ఓ వ్యక్తిని చంపేశారు. అమరేష్ నాయక్ అనే వ్యక్తి భువనేశ్వర్ లోని సుందర్పడ ప్రాంతంలో నివసిస్తూ ఉండే వాడు. దీపావళి రోజున సాయంత్రం తన స్నేహితులతో కలిసి టపాసులు కాల్చడం మొదలుపెట్టాడు. ఇంతలో ఓ 20 మంది ఉన్న గ్రూప్ అటుగా వచ్చింది.  అమరేష్ ను టపాసులు కాల్చొద్దు అంటూ వారు హెచ్చరించారు. అయితే ఎందుకు కాల్చకూడదు అంటూ అమరేష్ వాళ్ళని ప్రశ్నించాడు. దాంతో ఆ గ్రూప్ అమరేష్ పై దాడి చేశారు. అమరేష్ స్నేహితులు అడ్డుకోడానికి ప్రయత్నించగా వారిలో కొందరు ఓ పదునైన కత్తితో పొడిచేశారు. వెనువంటనే ఆ గ్రూప్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెంటనే అమరేష్ స్నేహితులు అతన్ని ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. డాక్టర్లు అమరేష్ ను పరిశీలించి అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.