
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే నియమితులయ్యారు. ఈ మేరకు జస్టిస్ బాబ్డే నియామకంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం సంతకం చేశారు. నవంబరు 18న ఆయన 47వ సీజేఐగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2021 ఏప్రిల్ 23 వరకు జస్టిస్ బాబ్డే సీజేగా కొనసాగనున్నారు.
సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి పదవీకాలం నవంబరు 17తో ముగియనుంది. దీంతో తన తర్వాత సీనియార్టీలో ఉన్న జస్టిస్ బాబ్డేను తదుపరి సీజేగా జస్టిస్ రంజన్ గొగొయి ఇటీవల ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. నిబంధనల ప్రకారం జస్టిస్ గొగొయి ప్రతిపాదనను న్యాయశాఖ మంత్రి.. ప్రధానమంత్రికి అందించారు. అనంతరం ప్రధాని.. రాష్ట్రపతికి సమర్పించారు. రాష్ట్రపతి ఆమోదంతో జస్టిస్ బాబ్డే తదుపరి సీజేగా నియమితులయ్యారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





