News

గుజరాత్ లో హిందువుల బైకులు తగలబెట్టిన ముస్లింలు

328views

భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న సందర్భంగా గుజరాత్ లోని గాంధీనగర్ జిల్లాలో జరిగిన వేడుకలు ఘర్షణకు దారి తీశాయి. న్యూజిలాండ్ పై భారత విజయాన్ని పురస్కరించుకొని దేహగామ్ పట్టణంలో ఆదివారం రాత్రి 10.30 ప్రాంతంలో కొంతమంది ద్విచక్రవా హనాల ర్యాలీ నిర్వహించారు. మసీదు సమీపంలోకి రాగానే వాహనదారులతో ముస్లింలు వాగ్వాదానికి దిగారు. బైకర్లపై దాదాపు 15 మంది దుర్భాషలాడారు. వారిపై దాడికి యత్నించడంతో బైకర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. కొందరు తమ వాహనాలను అక్కడే విడిచి పారి పోవడంతో ముస్లింలు వాటిని ధ్వంసం చేశారని డీఎస్పీ పీఎన్ వందా వెల్లడించారు. ఇందుకు సంబంధించి 11 మందిని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు మధ్యప్రదేశ్లోని మౌ పట్టణంలో నిర్వహించిన ఇదే తరహా ర్యాలీపై రాళ్లు రువ్విన ఘటనలో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు.దీనికి సంబంధించి కేసు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు.