
భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పదనం అని ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ యూత్ సర్వీసెస్ కమీషనర్ మరియు స్టెప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి కె శారదదేవి ఐ ఏ ఎస్ అన్నారు. భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, యున్ వైకే, విజయవాడ ఆధ్వర్యంలో అంతరాష్ట్రీయ యువ సమ్మేళనం మెదటి దశ లో భాగంగా సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మెకానికల్ కాన్ఫరెన్స్ హాల్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేరళలోని 6 జిల్లాలైన కన్నూర్, కొజికోడ్, కాసార్గాడ్, అలపోఝా మరియు త్రిసూర్, కొల్లాం జిల్లాల నుంచి మొత్తం 27 మంది యువతి యువకులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా శారదదేవి ఐఏఎస్ మాట్లాడుతూ మన దేశ ప్రజల మధ్య సాంప్రదాయకంగా ఉన్న భావోద్వేగ బంధాలను బలోపేతంగా కొనసాగించడం ఇటువంటి యువ సమ్మేళనాల ద్వారా సాధ్యం అవుతుందని అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా జిల్లా రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మాట్లాడుతూ మెహన్ కుమార్ యువ అంతరాష్ట్ర సమ్మేళనాలు ద్వారా వివిధ రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు మరియు అభ్యాసాల పరిజ్ఞానం రాష్ట్రాల మధ్య మెరుగైన అవగాహన మరియు బంధానికి దారితీస్తుంది అని తద్వారా భారతదేశ ఐక్యత మరియు సమగ్రతను బలోపేతం చేస్తుంది అని అన్నారు.
సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కాలేజి ఇంజనీరింగ్ విభాగపు డీన్ వెంకట్రావు మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలు ఒకరి ఒకరు ఇచ్చి పుచ్చుకోవడం గౌరవించడం మన దేశ సమైక్యత ను తెలియజేస్తుందని ఇటువంటి కార్యక్రమాల ద్వారా దేశం ఏకం అవుతుందని తెలిపారు.





