News

దలైలామాకి Z కేటగిరీ భద్రత.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

219views

బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాకి భారత ప్రభుత్వం Z కేటగిరీ భద్రతను కల్పించింది. చైనా మద్దతు దారుల నుంచి ఆయనకు ముప్పు పొంచి వుందన్న ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మేరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కమాండోలు భద్రతను కల్పిస్తారు. దలైలామా (89) రక్షణ బాధ్యత 33 మంది CRPF, VIP భద్రతా విభాగానికి అప్పగించింది.

దలైలామాకు Z-కేటగిరీ భద్రత కింద హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలోని ఆయన నివాసంలో సాయుధ స్టాటిక్ గార్డులు, 24 గంటలూ రక్షణ కల్పించే వ్యక్తిగత భద్రతా అధికారులు, షిఫ్ట్‌లలో సాయుధ ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేసే కమాండోలను ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా దలైలామాకు సీఆర్పీఎఫ్ కమాండోలు భద్రత కల్పిస్తారు. వీరితోపాటు శిక్షణ పొందిన డ్రైవర్లు, నిఘా సిబ్బంది అతని భద్రతను నిర్ధారించడానికి అన్ని సమయాల్లో విధుల్లో ఉంటారు.టిబెట్- చైనా పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత టిబెటన్ బౌద్ధమత ఆధ్యాత్మిక గురువు దలైలామా 1959 నుంచి భారతదేశంలోనే నివసిస్తున్నారు.