News

శ్రీకాళహస్తి ఆలయానికి 15 కోట్ల ఆస్తి విరాళం

642views

తమిళనాడులోని పొన్నేరి సమీపంలో గల మీంజురుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత వి ఆర్ భగవాన్ 15 కోట్ల విలువైన ఆస్తులను చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయానికి విరాళంగా ఇచ్చారు. మీంజూరులోని తన ఇల్లు, వ్యాపార భవన సముదాయం, దాని వెనక ఉన్న ఖాళీ స్థలాన్ని పొన్నేరి రిజిస్ట్రార్ కార్యాలయంలో ముక్కంటి ఆలయం పేరిట రిజిస్టర్ చేయించారు. త్వరలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఆలయ అధికారులకు ఆ పత్రాలను అందించనున్నట్లు ఆయన తెలిపారు. శివభక్తుడైన భగవాన్ దేశంలోని 12 జ్యోతిర్లింగాలను సందర్శించారు. 30కి పైగా గుడులను నిర్మించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.