
కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వరప్ప, అతని కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్ళలో ఐటీ శాఖ జరిపిన సోదాల్లో వారి వద్ద సుమారు 300కోట్ల అక్రమ సంపాదన ఉన్నట్టు తేలింది.
ఐటీ దాడుల ద్వారా కర్ణాటకలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలకు చెందిన మెడికల్ సీట్ల భర్తీలో జరిగిన భారీ కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. నిజానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన మెడికల్ కళాశాలలో నీట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు కేటాయించాల్సిన సీట్లను డ్రాప్ అవుట్ విధానం ద్వారా మేనేజ్మెంట్ కోటా కిందకి మార్చుకుని, ఆ సీట్లను భారీ మొత్తానికి అమ్ముకున్న వైనాన్ని చూసి అధికారులు నిర్ఘాంత పోయారు.
మెడికల్ సీట్ల స్కాం జరిగిన వైనం…
1) మేనేజ్మెంట్ ఒక ఏజెంట్ ను నియమించుకుంది.
2) ఆ ఏజెంట్ రాజస్థాన్లోని కోట నుంచి 150 నుంచి 300 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసుకున్నాడు. అలా ఏజెంట్ ఎంపిక చేసుకున్న వారిలో రెగ్యులర్ విద్యార్థులతోపాటు ద్వితీయ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులు కూడా ఉన్నారు.
3) నీట్ ఫలితాల వెల్లడి తర్వాత వారిలో లక్షలోపు ఆలిండియా ర్యాంకు వచ్చిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు లక్షల వరకు చెల్లించి వారిని డీమ్డ్ యూనివర్సిటీ కౌన్సిలింగ్కు పిలిపించారు.
4) అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మొదటి రౌండ్లో ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలన ఉండదు. కనుక వారికి నీట్ లో కేటాయించిన రోల్ నెంబర్లు, వచ్చిన ర్యాంకుల ఆధారంగా వారు సిద్ధార్థ మెడికల్ కాలేజీని ఎంపిక చేసుకుని రెండు లక్షల కౌన్సిలింగ్ ఫీజు చెల్లించి అడ్మిషన్ తీసుకుంటారు. ఈ మొత్తాన్ని వారికి ఏజెంట్ ఇస్తాడు.
5) కానీ వాళ్ళు ఎవరూ కళాశాలలో చేరకపోవడంతో ఆ సీట్లు అలాగ ఖాళీగా ఉండి మరళా రెండవ రౌండ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. మొదటి రౌండ్లో సీట్ల ఎంపిక చేసుకుని కళాశాలలో చేరలేకపోయిన విద్యార్థులకు ఎలాంటి ఫైను ఉండదు.
6) అలాగే సెకండ్ రౌండ్లో కూడా మళ్లీ వారే కౌన్సిలింగ్ కు వచ్చి ఫస్టు రౌండ్లోకి మల్లే సిద్ధార్థ మెడికల్ కాలేజీనే ఎంపిక చేసుకుంటారు. కానీ జాయిన్ కారు. ఆ సీట్లు అలాగే ఖాళీగా ఉంటాయి. అయితే సెకండ్ రౌండ్లో సీటు ఎంపిక చేసుకుని జాయిన్ కాని విద్యార్థులు రెండు లక్షలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కూడా వారికి ఏజెంటే ఇస్తాడు. మళ్లీ ఆ సీట్లు అలాగే ఖాళీగా ఉండడంతో ఆ సీట్ల భర్తీ కోసం మరలా మాప్ అప్ రౌండ్ (తుది రౌండ్) కౌన్సిలింగ్ జరుగుతుంది.
7 మళ్లీ యధావిధిగా తుది రౌండ్లో కూడా వాళ్లే ఆ సీట్లను ఎంపిక చేసుకుని జాయిన్ కాకపోగా 2 లక్షలు ఫైన్ కూడా చెల్లిస్తారు.
8 ఇక చివరి రౌండ్లో కూడా సీట్లు ఎంపిక చేసుకున్న విద్యార్థులు కళాశాలలో చేరకపోవడంతో ఆ సీట్లను మేనేజ్మెంట్ కోటా క్రిందకి మార్చడం జరుగుతుంది.
ఈ విధంగా చూసుకుంటే కళాశాల యాజమాన్యం ఒక్కొక్క సీటుని బ్లాక్ చేయడానికి 8 లక్షల వరకు ఖర్చు చేస్తుంది.
విద్యార్థికి (రెండు లక్షలు), రెండవ రౌండ్ ఫైన్ (రెండు లక్షలు), మాప్ అప్ రౌండ్ ఫైన్ (రెండు లక్షలు), ఏజెంట్ కి ఇచ్చేది (రెండు లక్షలు) మొత్తం ఎనిమిది లక్షలు కళాశాల యాజమాన్యం ఖర్చు చేస్తుంది.
ఇప్పుడు ఆ సీట్లను 50 నుంచి 70 లక్షల రూపాయలకు విద్యార్థులకు విక్రయిస్తుంది.
ఈ విధంగా మెడికల్ సీట్లను బ్లాక్ చేసి వాటిని మేనేజ్మెంట్ కోటా క్రిందకు మార్చుకొని పెద్ద మొత్తానికి అమ్ముకోవడం ద్వారా సీట్ల భర్తీ విషయంలో ఒక భారీ కుంభకోణానికి తెర తీశారు కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరప్ప, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





