News

‘‘ఇండియా పేరు మాత్రమే… అదే ’’భారత్’’ ఓ అనుభూతి

387views

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా వేదికగా శిక్షా సంస్కృతి ఉత్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘జ్ఞాన మహాకుంభ్’జరుగుతోంది. దీనికి దేశం నలమూలల నుంచి సాధు సంతులు హాజరవుతున్నారు. మన దేశాన్ని ఏమని పిలవాలి అన్న విషయంలో చాలా లోతైన చర్చే జరిగింది. అయితే.. ఇండియా అని పిలవడాన్ని ఈ సమావేశాలకు హాజరైన ప్రతినిధులందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. మన దేశాన్ని భారత్ అని పిలవాలని సూచించారు. ఇండియా అనేది ఓ పేరు మాత్రమేనని, భారత్ అనేది మాత్రం ఓ అనుభూతి అని మోతీలాల్ గుప్తా అన్నారు. భారత్ అనేది మన పూర్వీకుల వారసత్వం, సమస్త విశ్వానికి ప్రతిబింబమని అన్నారు.

మరోవైపు ముఖ్య అతిథిగా హాజరైన ఎం. గురూజీ మాట్లాడుతూ.. అందరితో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేయించారు. ఇది భారత దేశం. మేము భారతీయులం. భారతదేశం గురించి మాత్రమే శ్రద్ధ తీసుకుంటాం’’ అని అందరితో చెప్పించారు. ఇండియా అన్న శబ్దంతో ఎలాంటి సంబంధమూ లేదన్నారు.ఆ పదాన్ని స్వీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ఆనంద స్వరూప్ సరస్వతీ మహారాజ్ మాట్లాడుతూ.. భారత్ అన్న పదంతో దేశాన్ని పిలవడానికే తన సంపూర్ణ మద్దతను తెలియజేశారు. అలాగే ప్రస్తుత విద్యా వ్యవస్థపై కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. భారత్ లో విదేశీ విద్యను నేర్చుకోవడానికి కోట్లకు కోట్లు ఖర్చు చేయడాన్ని వ్యతిరేకించారు. ఇది ఏమాత్రం సరికాదని హితవు పలికారు. గురుకుల విద్యా విధానాన్ని తిరిగి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఇక.. జనతాకీ ఆవాజ్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు సుందర్ లాల్ బోత్రా మాట్లాడుతూ.. ఇండియా అన్న శబ్దాన్ని వ్యతిరేకించారు. హీరాలాల్ ను డైమండ్ అని పిలవని పక్షంలో మనం భారత్ ను ఇండియా అని ఎందుకు పిలవాలని ప్రశ్నించారు. అనువాదానికి హద్దులంటూ వుండాలన్నారు.

ఇక.. సాధ్వీ సమదర్శి గిరి మాట్లాడుతూ… భారత్ ను భారత్ అనే పిలవాలన్నారు. అలాగే మెకాలే విద్యా విధానంపై మండిపడ్డారు. మెకాలే విద్యా వ్యవస్థను నిర్మూలించేంత వరకూ ఇండియా అన్న పదం వుంటుందని, దీనిని తొలగించాలన్నారు. అలాగే మన భాషను, దేశాన్ని రక్షించుకోవాలన్నారు.

విదేశీయ సంస్కృతి ప్రభావం మనపై తీవ్రంగా పడిపోయిందని శిక్షా సంస్కృతి ఉత్థాన్ న్యాస్ కార్యదర్శి అతుల్ కొఠారీ అన్నారు. అది పాతుకుపోయిందని, దాని నుంచి నెమ్మదిగా బయటకు రావాలన్నారు. రోజువారీ వాడకంలోనూ దేశాన్ని భారత్ అని పిలవడం ప్రారంభించాలన్నారు. సాధ్యమైనంత వరకు అందరూ దేశాన్ని భారత్ అని పిలవాలని