News

పార్లమెంటులో రామాయణం సినిమా ప్రదర్శన …ఎప్పుడంటే…?

382views

భారత పార్లమెంట్ మరో అరుదైన సందర్భానికి వేదికగా నిలవనుంది. ఫిబ్రవరి 15న ‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్‌ ప్రిన్స్ రామ’ సినిమాను పార్లమెంటు లో ప్రదర్శించనున్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పార్లమెంటు సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు ఈ సినిమాను వీక్షించనున్నారు. ఈ విషయాన్ని గీక్‌ పిక్చర్స్‌ ఇండియా సహ వ్యవస్థాపకులు అర్జున్ అగర్వాల్‌ వెల్లడించారు.

1993లో ఈ యానిమేటెడ్‌ చిత్రాన్ని రూపొందించారు. 24వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్‌ ఇండియాలో ప్రదర్శించారు. థియేటర్‌లలో ప్రదర్శించడం కుదరలేదు. 2000 లో టీవీలో దీన్ని టెలికాస్ట్‌ చేయగా మంచి ఆదరణ లభించింది. దీనికి 4కే వెర్షన్‌ను సిద్ధం చేసి జనవరి 10న విడుదల చేశారు.

గీక్‌ పిక్చర్స్‌ఇండియా, ఏఏ ఫిల్మ్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. రామ్ మోహన్‌, యుగో సాకో దర్శకత్వం వహించిన ఈ యానిమేటెడ్‌ చిత్రానికి విజయేంద్రప్రసాద్‌ రచయితగా పనిచేశారు.