News

ఆలయ భూముల ఆక్రమించి చర్చి నిర్మాణం

52views

దేవస్థాన భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవదాయ శాఖ రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌(ఆర్‌జేసీ) ఎస్‌.చంద్రశేఖర్‌ ఆజాద్‌ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పామూరు మండల కేంద్రమైన పామూరు–నెల్లూరు రోడ్డులో ఆక్రమణకు గురైన శ్రీవల్లీ భుజంగేశ్వర, మదన వేణుగోపాలస్వామి ఆలయ భూములు, వాటిలో నిర్మించిన చర్చిలను క్షేత్రస్థాయిలో ఈఓ శ్రీగిరిరాజు నరసింహబాబుతో కలిసి పరిశీలించారు. ఆక్రమణదారులకు నోటీసులిచ్చి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టాలని ఈఓను ఆదేశించారు. ఆలయ భూముల్లో చర్చి నిర్మించారని బీజేపీ నాయకులు కొండిశెట్టి రమణయ్య ఆర్‌జేసీ దృష్టికి తీసుకురాగా తక్షణమే తొలగించాలని ఈఓకు సూచించారు. అనుమలశెట్టి సత్రం, వీరబ్రహ్మంద్రస్వామి ఆలయ ఆస్తులపై నివేదిక ఇవ్వాలని ఏఈ నరసింహబాబుకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్‌ గుర్రం వెంకటేశ్వర్లు, ఎస్‌.నరసింహులు, పశుపులేటి రఘురాం, బండ్లా నారాయణ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.