News

రక్తమోడుతున్న బెంగాల్

730views

శ్చిమ బెంగాల్ శాంతి భద్రతల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. విజయదశమి నాడు RSS కార్యకర్త బందు ప్రకాష్ పాల్ కుటుంబం మొత్తం హత్యకు గురైన విషయం మరచి పోక ముందే గత రెండు రోజులలోనే ముగ్గురు BJP కార్యకర్తలు హత్యకు గురవటం పరిస్థితికి అద్దం పడుతుంది.

అక్టోబర్ 9న భిర్భూంకి చెందిన అనిమేష్ చక్రవర్తి, నదియాకి చెందిన అహ్మద్ షేక్ లు హత్యకు గురయ్యారు. అనిమేష్, ఆహ్మద్ లు ఇద్దరూ చాలాకాలం నుండి BJP కార్యకర్తలుగా చురుకుగా వ్యవహరిస్తున్నారు. BJP సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా ఇద్దరూ చురుగ్గా వ్యవహరించిన వారు కావటం గమనార్హం. ఈ కారణంగానే వారిని తృణమూల్ గూండాలు హత్య చేశారని, వారి వెనుక జీహాదీ శక్తులు కూడా ఉన్నాయని BJP కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

        అలాగే అక్టోబర్ 10న సుప్రియో బెనర్జీ అనబడే పూజారి దారుణంగా హత్యకు గురయ్యారు. సుప్రియో సైతం BJP కార్యకర్త కాగా, ఆయన  హిందూ ధర్మ సంస్థలు నిర్వహించే ఎన్నో కార్యక్రమాలకు స్వచ్ఛంద సేవకుడిగా సేవలు అందించారు. ఈ వరుస  హత్యలతో రాష్ట్ర వ్యాప్తంగా BJP కార్యకర్తలు,సానుభూతి పరులలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా BJP వర్గాల వారు ఆకస్మిక ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పోలీసులు తమ ప్రాణాలకు రక్షణ కల్పించటం లేదని వారు ఆరోపిస్తున్నారు. గడచిన 4 రోజులలో 8 మంది BJP  సానుభూతి పరులు హత్యకు గురి కాగా, మమత బెనర్జీ ముఖ్యమంత్రి అయిన తరువాత ఇప్పటికి 81 మంది BJP కార్యకర్తలు హత్యకు గురయ్యారు.

బెంగాలీలకు అతి ముఖ్యమైన పండగ రోజులలో సైతం ముఖ్యమంత్రి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోయారని BJP రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. నిండు గర్భవతిని, పసిబిడ్డ అని సైతం చూడకుండా ఒక ఉపాధ్యాయుని కుటుంబం మొత్తం హత్యకు గురి కావటం రాష్ట్రంలోని పరిస్థితికి అద్దం పడుతోందని ఆయన ఆరోపించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.