News

చలికోటుపై క్యూఆర్‌ కోడ్‌..స్కాన్‌ చేస్తే రైల్‌ టికెట్‌

304views

మహాకుంభమేళాను మహోన్నతంగా నిర్వహించడానికి భారతీయ రైల్వే కూడా తన వంతు కృషి చేస్తోంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు రైళ్ల టికెట్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా క్యూర్‌ కోడ్‌ ద్వారా వాటిని పొందేలా ఉత్తర మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. దీని కోసం తొలిసారి తన సిబ్బందికి క్యూర్‌ కోడ్‌ ముద్రించిన జాకెట్స్‌ (చలికోట్లు) అందించింది. ఇవి ధరించిన సిబ్బంది స్టేషన్‌ ప్రాంగణంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఉండి ప్రయాణికులకు సహకరిస్తారు. వారి ధరించిన జాకెట్‌ వెనుక ఉండే క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేయడం ద్వారా రైల్వేకు చెందిన యూటీఎస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దానితో రెండో తరగతి రైలు టికెట్లను సులువుగా కొనుగోలు చేయవచ్చు.