దేవాలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కల్పించాలని, హిందువులే తమ దేవాలయాలను నిర్వహించుకోవాలనే లక్ష్యంతో విశ్వహిందూ పరిషత్ నిర్వహిస్తున్న హైందవ శంఖారావం సభ వైభవంగా ప్రారంభమైంది.
ఆదివారం తెల్లవారుజాము నుంచే వేలాదిగా ప్రజలు బహిరంగ సభా ప్రాంగణానికి స్వచ్ఛందంగా చేరుకోసాగారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచీ సభలో పాల్గొనడానికి వివిధ మార్గాల్లో వస్తున్న వారంతా క్రమంగా తమకు కేటాయించిన స్థానాల్లోకి చేరుకుంటున్నారు.
ఉదయం 9 గంటల నుంచీ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శ్రీరామ, శ్రీకృష్ణ, పరమ శివ స్తుతులతో కూడిన ప్రార్థనాగీతాలు, భజనలతో గీతాలాపనలు, నాట్యప్రదర్శనలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. హైందవ శంఖారావం ధ్యేయగీతం (థీమ్ సాంగ్) ఆహూతులను అమితంగా ఆకట్టుకుంది.
ఇస్కాన్ విజయవాడ వారు ఇటీవలి గీతాజయంతి సందర్భంగా భగవద్గీత ప్రచారం కోసం ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ఆ గీతాన్ని హైందవ శంఖారావం వేదికగా ఆవిష్కరించారు.
యువతలో శ్రీకృష్ణుడి స్ఫూర్తిని నింపుతూ ధార్మిక పరిరక్షణకు అంకితం కావలసిన బాధ్యతను గుర్తుచేస్తూ సాగిన గీతం సభలో పాల్గొంటున్న ప్రేక్షకులనే కాక టీవీ, సోషల్ మీడియా ద్వారా హైందవ శంఖారావం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరినీ ఉత్తేజితులను చేసింది.
బహు భారత్వం నిషేధం విషయంలో అసోం ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా, రెండో పెళ్లి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు షాక్...
లష్కరే తోయబా (LeT) ఉగ్రవాది, పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ (PMML) నాయకుడు ఇమ్రాన్ లియాకత్ భట్టి భారత్కు వ్యతిరేకంగా తీవ్ర బెదిరింపులకు దిగాడు. దీనికి సంబంధించిన...
మలయాళ నూతన సంవత్సరం, పవిత్ర చింగం మాసం ప్రారంభం సందర్భంగా శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. నెలవారీ పూజల్లో భాగంగా...
సేవాఘఢ్: బంజారా, గిరిజన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు సేవాఘఢ్ నుంచి ఢిల్లీ వరకు భారత్ గోర్ బంజారా జోడో యాత్ర...
చరక జయంతి వేడుకల్లో ధన్వంతరి హవనం.. 400 మందికి పైగా ఆయుర్వేద చికిత్సలు అనకాపల్లి జిల్లా కొడూరు గ్రామంలోని ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో విశ్వ ఆయుర్వేద...