News

హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుందాం

259views

హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుందామని తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఉమ్మడి కర్నూలు జిల్లా కార్య నిర్వాహకులు మల్లు వెంకటరెడ్డి అన్నారు.మాసపేట గ్రామం ఆంజనేయస్వామి ఆలయంలో ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా గో పూజ, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావం అలవరచుకోవడంతోపాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలని సూచించారు. బాల్యం నుంచి పిల్లలకు ఇతిహాసాలపై ఆసక్తి కల్పించాలన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు మరుగున పడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పర్వత యుగంధర్‌రెడ్డి, ఉపాధ్యాయులు వనజ కుమారి, గ్రామ పెద్దలు వంగూరు రామసుబ్బారెడ్డి, వంగూరు జనార్దన్‌ రెడ్డి, మధుసూదనరెడ్డి పాల్గొన్నారు.