
277views
గీతలను చక్కని ఆకృతిలో గీస్తే ఓ బొమ్మవుతుంది. గీతల బదులు ‘శ్రీరామ’ అనే అక్షరాలను రాస్తూ దేవుడి బొమ్మను వేస్తే.. రామ కోటి కూడా రాసినట్లవుతుంది. అంటే ఒకే యత్నంలో రెండు ఫలాలు అన్నమాట. గుంటూరులోని శ్రీనగర్ కు చెందిన నాగరాజు ఇదే చేశారు. వివిధ రంగుల్లో ‘శ్రీరామ’ అక్ష రాలను రాస్తూ రాముడు, హనుమంతుడు, శివుడి బొమ్మలు వేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన నాగరాజు ఇప్పటికే హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం, సుందరకాండలోని స్వామి రూపాలను తీర్చిదిద్దారు. చిన్నతనంలో నానమ్మ ఇలా బొమ్మలు వేసేవారని, ఆమె స్ఫూర్తితో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.





