
1947లో దేశ విభజన జరిగిన తరువాత చాలామంది హిందువులు పాకిస్తాన్లో ఉండిపోయారు. తరువాత ఇక్కడకు వచ్చేశారు. ఆ దేశ జనాభా 24 కోట్లు అత్యధిక జనాభా కలిగిన దేశాలలో ఇది ఐదో స్థానంలో ఉంది. వీరిలో 90 శాతం ముస్లింలు అందులో సున్నీలదే మెజారిటీ, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు మైనారిటీలు, హిందూ జనాభా 1.18 శాతం. చిత్రం ఏమిటంటే ఇటీవల కాలంలో పాకిస్తాన్ సైన్యంలో హిందువుల సంఖ్య బాగా పెరిగిందని చెబుతున్నారు. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా ముస్లిం మాత్రమే ఉండాలి. ముస్లింలతోనే ఏర్పాటైన సైన్యం మొదట్లో ఉండేది. అయితే 2000 సంవత్సరం నుంచి హిందువులను కూడా చేర్చుకోవడం ఆరంభించారు. ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యంలో ఉన్న హిందువులు 200 మంది. రెండొందలే అనుకోవద్దు. ఆ దేశ మొత్తం సైనిక బలగాన్ని బట్టి ఈ సంఖ్య ఎక్కువే. 2006లో హిందువు దానిష్ కెప్టెన్ అయ్యారు. అదొక మలుపుగా చెబుతారు. డాక్టర్ కైలాశ్ కుమార్, మేజర్ డా. అనిల్ కుమార్లను లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందారు.





