News

జమ్మూలో 15 కిలోల ఆర్‌డీఎక్స్‌, 40 కిలోల గన్‌ పౌడర్‌ స్వాధీనం

794views

గ్రమూకలు వేసిన భారీ పేలుడు కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. జమ్ము బస్టాండ్‌ ఆవరణలో నిలిపి ఉన్న బస్సులో దాదాపు 15 కిలోల ఆర్‌డీఎక్స్‌ను పోలీసులు మంగళవారం గుర్తించారు. బిలావర్‌ నుంచి జమ్ము బస్టాండ్‌కు వచ్చిన ప్రభుత్వ ఆర్టీసీ బస్సులో ఈ పేలుడు పదార్థాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆర్‌డీఎక్స్‌తోపాటు బిలావర్‌లోని దేవల్‌ ప్రాంతంలో ఓ ఇంటి నుంచి 40 కిలోల గన్‌ పౌడర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బస్సులోకి ఇంత పెద్ద మొత్తంలో ఆర్‌డీఎక్స్‌ ఎలా వచ్చిందన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, ప్యాకింగ్‌ చేసిన ఓ పెట్టెను బిలావర్‌లో ఓ మహిళ తమకు ఇచ్చిందని డ్రైవర్‌ చెప్పారు. జమ్ములో తమ బంధువులు ఆ పెట్టెను తీసుకుంటారని మహిళ చెప్పిందని విచారణలో వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.