
268views
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కేంద్ర ట్రైబల్ కల్చర్ సంయుక్త కార్యదర్శి నండూరి ఉమ తెలిపారు. ఆమె అనకాపల్లి జిల్లా ఏఎల్ పురంలో ఉన్న అల్లూరి సమాధుల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి దేశ స్వాతంత్య్రం కోసం పోరాటాలు నిర్వహించి ప్రాణాలు అర్పించారన్నారు. ఆయన ఎక్కడెక్కడ పోరాటాలు నిర్వహించారో గుర్తించి ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మంప, రాజేంద్రపాలెం, కృష్ణదేవిపేట ప్రాంతాల అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.





