News

దశమ భాగం కోసం చితక్కొట్టుకున్న పాస్టర్లు.. వీడియో వైరల్

288views

క్రిస్మస్ రోజే పాస్టర్లు చితక్కొట్టుకున్నారు. దేనికనుకుంటున్నారా అక్షరాలా డబ్బుల కోసమే. దశమ భాగం కోసమే. ఇది జరిగింది సైఫాబాద్ లూథరన్ చర్చిలో జరిగింది. క్రిస్టియన్ రోజు క్రిస్టమస్ కానుకలు దశమ భాగం విషయంలో ఒకరినొకరు తోసుకుంటూ పాస్టర్లు కొట్టేసుకున్నారు. పండగ పూట చర్చికి క్రిస్టియన్లు వస్తే… పాస్టర్ల గొడవ చూసి అవాక్కయ్యారు. వీరిద్దరి గొడవను ఆపేందుకు ఇతర పాస్టర్లు ఆపడానికి, సర్దిచెప్పడానికి ప్రయత్నాలు చేసినా లాభం లేదు.

ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. క్రిస్మస్ రోజు బైబిల్ వాక్యాలు వినాల్సిన నోట… బండ బూతులు వినిపించాయి. త్యాగం, ప్రేమ, కరుణ అంటూ తెగ వాక్యాలు వల్లించే పాస్టర్లు డబ్బుల కోసం, దశమ భాగం కోసం కొట్టుకు చావడం చూస్తుంటే అందరూ విస్తుపోతున్నారు.

అయితే.. పాస్టర్ల మధ్య తగాదాలు, కొట్లాడుకోవడాలు మనకు కొత్తేమీ కాదు. గతంలోనూ గుంటూరు ఆంధ్రా లూథరన్ ఎవాంజెలికల్ చర్చిలో ఎప్పుడూ గ్రూపు విభేదాలు వుంటూనే వుంటాయి. అలాగే కొన్ని రోజుల క్రితం భద్రాచలంలోని CSI చర్చిలో కూడా పాస్టర్లు ఇదే విధంగా ప్రవర్తించారు. మరోవైపు హైదరాబాద్ చిక్కడపల్లిలోని హెబ్రోన్ చర్చిలో ఆదివారం వచ్చిందంటే చాలు.. భక్తులు తమ ప్రార్థనలు ముగించుకొని, భయపడుతూ వెంటనే వెళ్లిపోతారు.