News

మోదీ, యోగిపై కుంభమేళాలో దాడి చేస్తాం: పన్నూ

227views

ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిలపై దాడి చేస్తామంటూ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ బెదిరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఇందుకుతన ఉగ్రవాద సంస్థ సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) కుంభమేళా సందర్భంగా ప్రతీకారం తీర్చుకుంటుందన్నాడు. నకిలీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సిక్కు యువతను చంపినట్టు ఆ వీడియోలో పన్నూ ఆరోపించాడు. చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్టు హామీ ఇచ్చాడు. కుంభమేళాలలో భాగంగా షాహి స్నానాలకు శుభప్రదమైన జనవరి 14, 29, ఫిబ్రవరి 3వ తేదీల్లో దాడులు చేయనున్నట్టు చెప్పాడు. ఆ రోజుల్లో ప్రధాని మోదీ, సీఎం యోగిలు ప్రయాగ్‌రాజ్‌లో ఉంటారని నొక్కిచెప్పాడు.