
339views
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని టిటిడి ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో ఒక కేంద్రంలో నాలుగు కలిపి మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటుచేసి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు. జనవరి 10, 11, 12వ తేదీలకుగాను 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు విడుదల చేస్తామని, మిగిలిన తేదీలకు ఒకరోజు ముందుగా జారీ చేస్తామని తెలిపారు. భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని.. టోకెన్లు లేని భక్తులకు ఈ పది రోజుల్లో శ్రీవారి దర్శనం ఉండదని స్పష్టం చేశారు.





