News

శ్రీ శంబర పోలమాంబ జాతర

316views

రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గిరిజన జాతరగా గుర్తింపు పొంది, ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన శ్రీ శంబర పోలమాంబ జాతర వచ్చే నెల 27,28,29 తేదీలలో జరగునుంది. ఈ జాతరలో భాగంగా తొలి ఘట్టమైన శ్రీ పెదపోలమాంబ అమ్మవారి సనప చాటింపు నిర్వహించి ఈనెల 30 వ తేదీన శ్రీ పెదపోలమాంబ అమ్మవారిని ఆలయ ఈ.ఓ వి.వి. ఎస్ నారాయణ ఆధ్వర్యంలో గ్రామంలోనికి తీసుకురానున్నారు. జనవరి 6 న తోలేల్లు ఉత్సవం, 7 న ప్రధాన ఉత్సవం, 8 న అనుపోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి జాతర ప్రారంభమౌతుంది.