
ఉత్తరప్రదేశ్‌లో శ్రీరాముడు కొలువైన అయోధ్య పలు రికార్డులు సృష్టిస్తోంది. అయోధ్య రామాలయం సరికొత్త రికార్డ్ ను సొంతం చేసుకుంది.నూతన రామాలయంలో బాలక్ రామ్‌ను ప్రతిష్టించిన తర్వాత అయోధ్యలో చారిత్రాత్మక స్థాయిలో దీపోత్సవాన్ని నిర్వహించడంతో ఇప్పటికే మూడు రికార్డులు నమోదయ్యాయి.
తాజాగా అయోధ్య రామాలయం సరికొత్త రికార్డ్ ను సొంతం చేసుకుంది. దేశంలోనే మోస్ట్ పాపులర్ టూరిస్ట్ ప్లేస్ గా అయోధ్య నిలిచినట్టు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఒకప్పుడు ఆగ్రాలోని తాజ్ మహల్ పర్యాటక రంగంలో టాప్ ఉండేదని.. ఇప్పుడు దాని రికార్డ్ నుఅయోధ్య బద్ధలు కొట్టిందని తెలిపింది. ఈ మేరకు యూపీ పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ వివరాలు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 13.55 కోట్ల మంది దేశీయ పర్యాటకులు, 3153 మంది విదేశీ టూరిస్టు లు అయోధ్యను సందర్శించారు. కానీ తాజ్ మహల్ ను మాత్రం 12.51 కోట్ల మంది మాత్రమే సందర్శించారని వెల్లడించారు.





