
తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2025 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆప్ లైన్ లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తున్నట్లు టిటిడి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. 2025 సంవత్సరానికి సంబంధించి 12- పేజీలు, 6- పేజీలు, టేబుల్-టాప్-క్యాలెండర్‌లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి పెద్దసైజు, శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారు ఇరువురు ఉన్న కేలండర్లను అందుబాటులో ఉంచినట్లు ఆ ప్రకటనలో టిటిడి తెలిపింది. ముఖ్యంగా టిటిడి ఎంపిక చేసిన ప్రాంతాలైన తిరుమల, తిరుపతి, తిరుచానూరులో ఉన్న టిటిడి పబ్లికేషన్ స్టాల్స్‌తో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీ, ముంబై, వేలూరు, ఇతర ప్రధాన కళ్యాణమండపాల్లో 2025 సంవత్సరం క్యాలెండర్‌లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచారు. టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వారి ఇంటి వద్దే టిటిడి డైరీలు, క్యాలండర్లను పొందే సౌలభ్యం ఉందని టిటిడి ఆ ప్రకటనలో తెలిపింది.





