
ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం సింగరాజుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్టి నేపథ్యంలో 50,000 భక్తులకు మహా అన్న సంతర్పణ నిర్వహించారు.ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో కైకలూరు రూరల్,టౌన్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో సుమారు 100 సిబ్బందితో పటిష్టమైనటు వంటి బందోబస్తును ఏర్పాటు చేశారు.ఈ అన్న సంతర్పణ సందర్భంగా దేవస్థానం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లతో పాటుగా జిల్లా ఎస్పీ యొక్క ఆదేశాలతో మొట్ట మొదటి సారిగా డ్రోన్ కెమెరాలతో దేవాలయాల ప్రాంగణాల ప్రాంతంలో పర్యవేక్షణ చేస్తూ ఎటువంటి అసౌకర్యాలు ప్రజలకు కలగకుండా డ్రోన్ కెమెరా ద్వారా నిఘా ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నాలుగు పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేసినట్లు,శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం రోడ్డుకు ప్రక్కగా ఉండటం వలన ట్రాఫిక్ వలన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు,సింగరాజుపాలెంలో పోలీస్ కంట్రోల్ రూమును ప్రత్యేకముగా ఏర్పాటు చేసినట్లు భక్తులు వాహనాలను గుడికి వెనుక భాగంలో గల ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టారు.





