News

భక్తుల మనోభావాలు గౌరవించాలి

193views

శృంగేరీపీఠ జగద్గురువులు భారతీ తీర్ధ మహాస్వామి, విధుశేఖర మహాస్వామి మీద చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను స్వామి వారి భక్త బృందం ఖండించింది.విజయవాడ శివరామకృష్ణ క్షేత్రంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వేద పండితులు చింతపల్లి ఆంజనేయ ఘనాపాటి మాట్లాడారు. ఆదిశంకరులు స్థాపించిన పీఠాల్లో శృంగేరీ పీఠం ప్రధానమైనదని చెప్పారు. నాటి నుంచి పీఠాధిపత్యం వహించన వాళ్లు ధర్మరక్షణకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. వేద సంస్కృతిని కాపాడుతున్న వారిపై ఏమాత్రం అవగాహనలేని గోవిందానందస్వామి మాట్లాడుతున్న మాటలు సమర్ధనీయం కాదన్నారు. శివరామకృష్ణ క్షేత్రం ధర్మాధికారి ఎస్‌.హనుమత్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ కాషాయం కట్టిన వారంతా స్వామీజీలు కాలేరని పేర్కొన్నారు. ధర్మవర్తన కలిగి ఉండాలని సూచించారు. శృంగేరీ పీఠాన్ని, జగద్గురువులను కోట్లాది మంది భారతీయులు తమ ఆరాధ్య దైవంగా భావిస్తారని వారి మనోభావాలను గౌరవించాలని కోరారు. గోవిందానందస్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేశారు. సమావేశంలో మల్లాది రామనాథశర్మ, కప్పగంతు పండరినాథ్‌, గోరుగుంట రవి పాల్గొన్నారు.