
269views
బాపట్ల జిల్లా, చీరాల మండల పరిధిలోని వాడరేవు సముద్రతీరంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సాగర హారతి కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య తీరం ఓడ్డున పరమ శివునికి ప్రత్యేక పూజలు,విశేష అభిషేకాలు నిర్వహించారు .అనంతరం శాస్త్రోక్తంగా సాగర హారతి నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా గుంటూరు జిల్లా తాళ్లాయపాలేనికి చెందిన శైవ క్షేత్ర పీఠాధిపతులు శివ స్వామీజీ పాల్గొన్నారు. ఈసందర్భంగా వాడరేవు సాగర తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పటిక శివలింగానికి వివిధ ద్రవ్యాలతో అభిషేకించారు. ఈక్రమంలో విజయవాడ వేదికగా జనవరి 5 వ తేదీన జరుగునున్న హిందూ శంఖారావానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని హిందూ చైతన్య వేదిక నిర్వాహకులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.





