News

మధ్యప్రదేశ్‌లో గీతా పారాయణం.. గిన్నిస్‌లో చోటు

205views

భోపాల్, ఉజ్జయినిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గీతా పారాయణానికి ప్రపంచ గిన్నిస్ రికార్డు లభించింది. లాల్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హాజరయ్యారు. గీతా జయంతిని పురస్కరించుకొని ఈ గీతా పారాయణానికి సుమారు 5 వేల మంది భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గీతా పఠనం చేశారు. దీంతో ఈ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో నమోదైంది. భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు గీతా బోధనను అనుసరిస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో గీతా భవన్ లు నిర్మిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. అలాగే ఇకపై గోశాలలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని సీఎం ప్రకటించారు.