News

శంబర పోలమాంబ జాతర ఏర్పాట్లు

319views

ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతి గాంచిన శంబర పోలమాంబ జాతరను రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ తెలిపారు. పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో శంబర జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలోని మక్కువ మండలంలో శంబర పోలమాంబ జాతర ప్రతీ సంవత్సరం ఘనంగా జరుగుతుందని తెలిపారు. ఉత్సవాలలో భాగంగా జనవరి27వ తేదీన తోలెళ్ళ ఉత్సవం, 28న అమ్మవారిసిరిమాను ఉత్సవం, 29న అనుపోత్సవం జరుగుతాయని పేర్కొన్నారు. కాగా, జాతరకు ఇతర రాష్ట్రాల నుండిలక్షలాదిగా భక్తులు తరలివస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.