News

హిందుత్వ ఒక వ్యాధి: ఇల్తీజా వివాదాస్పద వ్యాఖ్యలు

209views

హిందుత్వ విషయంలో జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ అవమానించేరకంగా వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మం అనేది ఓ వ్యాధి అని, ఇది భారత్ లోని కొన్ని కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ రకంగా ఆమె ఇస్లాంను సమర్థించినట్లే. జైశ్రీరామ్ అన్న నినాదాన్ని మూకదాడులతో ముడిపెడుతూ ఆమె ట్వీట్ చేశారు. హిందూ ధర్మాన్ని వ్యాధితో పోల్చడంపై జాతీయవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. వెంటనే ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

‘‘హిందుత్వ ఓ రోగం. దీనిని నయం చేయాలంటూ వ్యాఖ్యానించింది.హిందుత్వకు, హిందూయిజానికి చాలా తేడా వుందని, హిందువుల ఆధిపత్యం కోసం 1940 లో వీర సావర్కర్ దీనిని వ్యాప్తి చేశారంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. ఇండియా అంటే హిందువులదని, హిందువుల కోసమేనని ఆ సిద్ధాంతం చెబుతోందని పేర్కొన్నారు. అలాగే ఇస్లాం లాగే హిందూయిజం కూడా లౌకికవాదం, ప్రేమను ప్రోత్సహించే మతమని, దీన్ని వక్రీకరిస్తున్నారంటూ దురుద్దేశాన్ని ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేశారు. హిందూయిజానికి వక్రభాష్యం చెబుతున్నారని అన్నారు.

ఇల్తిజా ముఫ్తీ వ్యాఖ్యలపై హిందువులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె వాడిన భాష అత్యంత ఇబ్బందికరమని, రాజకీయాల్లో భేదాభిప్రాయాలు వుండాలి కానీ… ఒకరిపై ద్వేషం వుండొద్దని పేర్కొన్నారు. తాజాగా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం పాలైంది. అలాగే ఇల్తిజా ముఫ్తీ కూడా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఘోర పరాభవంపై సమీక్షలు చేసుకోకుండా హిందుత్వాన్ని విమర్శించడం, దానిపై కువిమర్శలు చేయడం దిగజారుడు తనానినికి నిదర్శనం.