News

మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు

253views

స్వాతంత్య ఉద్యమ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన ఎందరో మహనీయుల పేర్లు చరిత్రపుటల్లో లేవని, నాటి ప్రభుత్వాలు వారికి సముచిత స్థానం ఇవ్వకపోవడం దురదృష్టకరమని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు శివారు రాజుపేటలో రత్న గ్రూప్స్ సంస్థల ఆధ్వర్యంలో బోరుకాటి రామరాజు జ్ఞాపకార్థం ఏర్పాటైన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు మహోజ్వల శక్తి అని అన్నారు.

త్యాగధనుల త్యాగాలను ఆజాదీకా అమృత్ కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ స్మరించి వారికి సముచిత స్థానం కల్పించారని తెలిపారు. అల్లూరికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్రమోదీ అని పేర్కొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ భోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టే ఆలోచన హర్షిణీయమన్నారు. మంత్రి కె. పార్థసారథి మాట్లాడుతూ సీతారామరాజు ఆశయాల్ని ప్రజలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు.