News

మానవాళి మనుగడకు ఆధారం సనాతన ధర్మం

179views

సనాతన ధర్మం మానవాళి మంచి కోరుకుంటుందన్నారు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో విజయేంద్ర సరస్వతి మాట్లాడుతూ వేదాలే జీవితంలో సన్మార్గానికి దారి చూపుతుందన్నారు. మనిషి ఆచరించాల్సిన నియమాలు, చేయకూడని పనులు సనాతన ధర్మం చెబుతోందని..విశ్వశాంతి వైపు భారత దేశం ముందు అడుగులు వేస్తోందన్నారు. ధర్మప్రచారం చేయడం ద్వారా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు.