News

నంద్యాలలో హిందువుల భారీ ర్యాలీ

153views

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలు దాడులకు నిరసనగా నంద్యాలలో భారీ ర్యాలీ చేపట్టారు. విశ్వహిందూ పరిషత్‌, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్- ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌ పరివార్‌, బీజేపీ అనుబంధ సంస్థలు, హిందూ పరిరక్షణ సంస్ధలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ టెక్క భారతమాత గుడి నుంచి గాంధీచౌక్‌ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసిన చిన్మయదాస్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. బీజేపీ జిల్లా కోఆర్డినేటర్‌ అభిరుచి మధు, ఇనుగూరి రమేష్‌, పోలేపల్లి సందీప్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘం నాయకులు, బీజేపీ అనుబంద సంస్ధలు, హిందూ సంస్థలు, సంఘ్‌పరివార్‌సంస్ధలు, భారీఎత్తున హిందువులు పాల్గొన్నారు