News

వక్ఫ్ బోర్డు నుంచి కొప్పాల్ మఠం ఆస్తులు తిరిగి ఇవ్వాలి

70views

వక్ఫ్ ఆస్తులలో చేరిపోయిన కర్ణాటకలోని కొప్పాల్ హళకేరి శ్రీ అన్నదానేశ్వర శాఖ మఠం ఆస్తులను తిరిగి ఇవ్వాలని స్థానిక వీరశైవులు ప్రభుత్వాన్ని కోరారు. నవంబర్ 21న వీరశైవ వర్గం నాయకులు మఠంలో సమావేశమై దీని గురించి చర్చించారు. ఈ మఠం స్థానిక వీరశైవులు శతాబ్దాలుగా ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. మఠం ఆస్తులను వక్స్ ఆస్తుల జాబితాలోకి బదలీ చేశారు. ఈ మఠం కేంద్రంగా సామాజిక సేవా కార్యక్రమాలు, పాఠశాలలు నడస్తున్నాయి. ఇది 35 కుంటల భూమిలో విస్తరించి ఉంది. ఇందులో 18 కుంటల భూమిని దర్గా, శ్మశాన వాటిక భూమిగా రిజస్టర్ చేశారు. మిగిలిన మఠం ఆధ్వర్యంలోని పాఠశాల పేరుతో ఉంది. ఇంతకీ ఆ 18 కుంటల భూమిని జనవరి 29, 2021 లోనే వక్స్ ఆస్తిగా సర్వే నెం 17 పేరుతో రిజిస్టర్ చేశారు. ఈ బదలీనే రద్దు చేయవలసిందిగా స్థానిక వీరశైవ వర్గీయులు కోరుతున్నారు. చిరకాలంగా ఈ ప్రాంతంలో హిందువులు, ముస్లింలు సఖ్యతతోనే ఉన్నారని, మఠం భూమిని వక్స్ ఆస్తిగా రిజస్టర్ చేయడం వల్ల ఉద్రిక్తతలు తలెత్తాయని పెద్దలు చెప్పారు.