News

బంగ్లాదేశ్‌కి ‘‘కరెంట్ షాక్’’ ఇచ్చిన త్రిపుర

101views

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా…. భారతీయులు ప్రయాణిస్తున్న బస్సుపై బంగ్లాదేశ్ ప్రాంతంలో దాడి జరిగింది. ఈ నేపథ్యంలో త్రిపుర ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. త్రిపుర రాష్ట్రానికి ఇవ్వాల్సిన విద్యుత్ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని బంగ్లాదేశ్ కి సూచించింది. మొత్తం 135 కోట్ల బకాయిలను వెంటనే క్లియర్ చేసేయాలని నిర్ద్వంద్వంగా చెప్పేసింది. బంగ్లాదేశ్ లోని బ్రహ్మణ బరియా జిల్లాలో రెండు రోజుల క్రితం ఢాకా మీదుగా ప్రయాణిస్తున్న అగర్తలా కోల్ కత్తా బస్సుపై ముస్లిం ఛాందసులు దాడికి దిగారు. బస్సుపై దాడి చేసి, భారత వ్యతిరేక నినాదాలు కూడా చేశారు. ఈ చర్య జరగ్గానే త్రిపుర ప్రభుత్వం బకాయిలు కట్టాల్సిందేనని బంగ్లాదేశ్ కి తెగేసి చెప్పేసింది.

ఇదే విషయంపై త్రిపుర విద్యుత్ శాఖా మంత్రి రతన్ లాల్ మాట్లాడారు. 135 కోట్ల బకాయిలు వున్నప్పటికీ.. బంగ్లాదేశ్ క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తోందని, ప్రతి యూనిట్ కి తాము 6.65 రూపాయలు వసూలు చేస్తున్నామన్నారు.అయితే ఇలా బకాయిలు పడటం ఇదే ప్రథమం కాదని, 135 కోట్ల బకాయిలు వుంచటంతో సరఫరాని పరిమితం చేశామని వెల్లడించారు. ఒక యేడాదిగా బంగ్లాదేశ్ చెల్లింపులే చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బకాయిలు పెరిగిపోయాయమని, ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ త్రిపుర నుంచి 160 మెగావాట్ల కరెంట్ ని పొందే అర్హత వుందన్నారు.

ఇదే బకాయిల విషయంపై బంగ్లాదేశ్ పవర్ డెవలప్ మెంట్ బోర్డు చైర్మన్ తో వ్యక్తిగతంగా కూడా భేటీ అయ్యానని మంత్రి రతన్ లాల్ వెల్లడించారు. ఇదే విషయాన్ని కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లానని అన్నారు. ఒప్పందం ప్రకారం, బంగ్లాదేశ్‌కు త్రిపుర నుండి 160 మెగావాట్ల శక్తిని పొందేందుకు అర్హత ఉంది, దీని ట్రేడింగ్‌ను NTPC విద్యుత్ వ్యాపార నిగమ్ (NVVN) పర్యవేక్షిస్తుందని, సకాలంలో చెల్లింపులు జరగాలని తాము NVVN తో కూడా మాట్లాడామని తెలిపారు. బంగ్లాదేశ్ వాయిదాల వారీగా బకాయిలను చెల్లిస్తోందని, దీంతో రాష్ట్ర విద్యుత్ కార్పొరేషన్ నిధుల విషయంలో తీవ్ర ప్రభావం పడుతోందన్నారు.