News

ఒంగోలులో విశ్వహిందూ పరిషత్ నిరసన ప్రదర్శన

316views

సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్రం భారతదేశం అని భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ ఇచ్చిన ఆందోళన ఆందోళన పిలుపులో భాగంగా బుధవారం ఒంగోలులో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు, హిందూ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ విలేకరులతో మాట్లాడుతూ, బాంగ్లాదేశ్ మత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ గళం కలపాలన్నారు.దేశం విడిపోయిన సమయంలో భారతదేశంలో ఎనిమిది శాతం మంది ఉన్న మైనార్టీలు నేడు 16% కాగా బంగ్లాదేశ్ లో మాత్రం వీరి సంఖ్య ఎనిమిది శాతం నుంచి 0.8 శాతానికి పడిపోయిందన్నారు. హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలకు ఈ గణాంకాలే నిదర్శనం అన్నారు. బంగ్లాదేశ్లో హిందువులకు హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అందరూ ముక్తకంఠంతో ఖండించాలన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు సిరసనగండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, హిందువులపై జరుగుతున్న అమానుష దాడులు విచారకరమన్నారు. ఈ దాడులకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ ఆందోళనలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.