
అరెస్టైన చిన్మయ్ కృష్ణదాస్ తరపు న్యాయవాది రమణ్ రాయ్ పై ఇస్లామిక్ ఛాందసులు దాడి చేశారు. అంతేకాకుండా ఆయన నివాసంపై కూడా దాడి చేసి, ధ్వంసం చేశారు. ప్రస్తుతం లాయర్ రమణ్ రాయ్ ప్రాణాపాయ స్థితిలో వున్నారు. మృత్యువుతో పోరాడుతున్నారని ఇస్కాన్ ప్రతినిధి రాధారమన్ దాస్ ప్రకటించారు. బలవంతంగా ఆయన ఇంట్లోకి ప్రవేశించి, నానా బీభత్సం సృష్టించారన్నారు. కోర్టులో చిన్మయ్ కృష్ణదాస్ ను సమర్థించడమే న్యాయవాది రామెన్ రాయ్ చేసిన తప్పని, అందుకే ఇస్లామిక్ ఛాందసులు ఆయనపై దాడికి దిగారని ఇస్కాన్ పేర్కొంది. ప్రస్తుతం న్యాయవాది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనుస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం చిన్మయ్ కృష్ణదాస్ ను సమర్థిస్తున్న 70 మంది హిందూ న్యాయవాదులను కఠినంగా శిక్షించింది. హిందువులపై అక్కడి ప్రభుత్వానికి ఎంత ద్వేషముందో తెలియడానికి ఇదో ఉదాహరణ.హిందువుల ధైర్య సాహసాలు ఎంతలా విచ్ఛిన్నం చేయాలో అన్ని ప్రయత్నాలూ చేస్తూనే వుంది. అయినా అత్యంత ధైర్య సాహసాలతో కృష్ణప్రభు పక్షాన వాదించడానికి లాయర్ రమణ్ రాయ్ ముందుకు వచ్చారు. ఆయనపై ఛాందసులు దాడికి దిగారు.
దాడిని తీవ్రంగా ఖండించిన ఇస్కాన్
లాయర్ రమణ్ రాయ్ పై ఇస్లామిక్ ఛాందసులు చేసిన దాడిని ఇస్కాన్ తీవ్రంగా ఖండించింది. దయచేసి లాయర్ రమణ్ రాయ్ కోసం అందరూ ప్రార్థనలు చేయాలని ఇస్కాన్ ప్రతినిధి రాధా రమణ్ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. అతను చేసిన ఒకే ఒక తప్పు.. చిన్మయ్ కృష్ణ పక్షాన వాదించడమని, అందుకే ముస్లింలు అతనిపై, అతని ఇంటిపై దాడి చేశారని, అత్యంత దారుణమని దుయ్యబట్టారు.





