News

బంగ్లాదేశ్ లో ఐరాస శాంతి పరిరక్షక మిషన్

282views

బంగ్లాదేశ్‌ పరిణామాలపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌కు శాంతి స్థాపక దళాలను పంపాల్సిందిగా ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేయాలని ఆమె సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బంగ్లాదేశ్‌లో పీడనకు గురైన భారతీయులను తక్షణం స్వదేశానికి తరలించేలా ఏర్పాటు చేయాలని మమత ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభ్యర్థించారు.
భారత్‌-బంగ్లా సరిహద్దులో సన్యాసుల ఆందోళన
బంగ్లాదేశ్‌లో అరెస్టైన ఆధ్యాత్మిక గురువు చిన్మయ్‌ కృష్ణదాస్‌ విడుదల కోరుతూ 1000 మందికిపైగా సన్యాసులు పశ్చిమబెంగాల్‌లోని నార్త్‌ 24 పరగణాల జిల్లాలో పెట్రాపోల్‌ సరిహద్దు వద్ద సోమవారం ప్రదర్శన నిర్వహించారు.