
తొమ్మిది వందల సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఎంతో చరిత్ర కలిగిన పల్నాటి వీరుల ఉత్సవాలు సందర్భంగా అతి ముఖ్యమైన ఘట్టంగా పిలవబడే మూడవ రోజు చాపకుడు కార్యక్రమాన్ని సోమవారం
పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని వీర్ల గుడిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు హాజరయ్యారు.
అనంతరం పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితమే అలనాటి బ్రహ్మనాయుడు ప్రవేశపెట్టిన చాపకుడు సిద్ధాంతాన్ని ప్రారంభించారు. వారందరూ మనమందరం ఒకటే అందరూ సమానమే అంటూ పీఠాధిపతితో కలిసి భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన మహాభారత యుద్ధాన్ని పోలిన మరో యుద్ధ ఘట్టం మన పల్నాటి వీరుల యుద్ధమేనని అంతటి చరిత్ర కలిగిన మన వీరుల ఉత్సవాలను ప్రతి రోజు ఒక ప్రత్యేకతను సంతరించు కుందని అలాగే కులమతాలకు అతీతంగా నడుచుకోమని తొమ్మిది వందల సంవత్సరాల క్రితమే బ్రహ్మనాయుడు తెలిపాడని దాని ప్రకారమే నేడు కులమతాలకతీతంగా ఈ చాపకుడు కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు.





