
155views
తిరుపతి అలిపిరిలో భద్రతా తనిఖీల వైఫల్యం మరోసారి వెలుగుచూసింది. అన్యమతనానికి చెందిన వ్యాఖలతో కూడిన ఓ కారు తిరుమలకు రావడం విమర్శలకు దారితీసింది. సాధారణంగా రాజకీయ, ఇతర మతాలకు చెందిన ఫొటోలు, గుర్తులు, నినాదాలతో వాహనాలు తిరుమలకు రావడం నిషేధం. వీటిని అలిపిరి చెక్‌పాయింట్ తనిఖీల్లోనే భద్రతా సిబ్బంది అడ్డుకోవాలి.
అయితే నిర్లక్ష్యం కారణంగా ఇతర మతానికి చెందిన వ్యాఖ్యలతో కూడిన కారు నేరుగా తిరుమలకు చేరుకుంది. ఆ కారును ఆలయానికి సమీపంలోని అర్చక నిలయం వద్ద పార్కింగ్‌లో ఉంచడం చర్చనీయాంశమైంది.





