News

బంగ్లాదేశ్ లో హిందువులపై అకృత్యాలను తక్షణమే ఆపాలి : ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే

251views

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను వెంటనే నిలిపేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే డిమాండ్ చేశారు. అంతేకాకుండా అన్యాయంగా అరెస్టైన ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ ని కూడా విడుదల చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘బంగ్లాదేశ్ లోని హిందువులు, మైనారిటీలపై దాడులు, హత్యలు, దోపిడీలు, దహనాలు జరుగుతున్నాయి. ఇవి అత్యంత అమానవీయం. ఈ దౌర్జన్యాలు అత్యంత ఆందోళనకరమైనవి. వీటిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆరెస్సెస్ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వం వీటికి అడ్డుకట్ట వేయాల్సింది పోగా… కేవలం మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తోంది. ఈ అఘాయిత్యాలను ఆపడానికి వెంటనే ప్రయత్నాలు ప్రారంభించాలి. ప్రజాస్వామ్య మార్గంలో హిందువులు తమ స్వీయరక్షణ కోసం లేవనెత్తిన గొంతులను బలవంతంగా అణచివేస్తున్నారు.

ఇలాంటి శాంతియుత నిరసనల్లో హిందువులకు నాయకత్వం వహిస్తున్న ఇస్కాన్ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్‌ను బంగ్లాదేశ్ ప్రభుత్వం జైలుకు పంపడం అన్యాయమని తెలిపారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను తక్షణమే ఆపి, శ్రీ చిన్మోయ్ కృష్ణ దాస్‌ను జైలు నుండి విడుదల చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

ఈ క్లిష్ట సమయంలో భారత్, ప్రపంచ దేశాలు, సంస్థలు బంగ్లాదేశ్ బాధితులకు మద్దతుగా నిలబడాలి. తమ మద్దతును ప్రకటించారు. ప్రపంచ శాంతి కోసం, సౌభ్రాతృత్వం కోసం ఈ ప్రయత్నం కొనసాగాలి’’ అని దత్తాత్రేయ హోసబళే పేర్కొన్నారు.