50
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఊటుకూరులోని శ్రీకోదండ రామాలయంలో హిందూ ధర్మప్రచార పరిషత్ ధర్మాచార్యులు గంగనపల్లి వెంకటరమణ రామాయణం విశిష్టత పై ధార్మికో పన్యాసం చేశారు. తితిదే, హిందూ ధర్మప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో- ఊరూరా హిందూ ధర్మంపై ప్రచారం చేస్తున్నామన్నారు. రామాయణంలోని ప్రతి పాత్ర జాతికి సమున్నతమైన సందేశాన్ని ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో తితిదే కార్యక్రమ ఇన్చార్జి గోపీబాబు, గ్రామస్థులు పాల్గొన్నారు.