News

‘పంచ వైష్ణవ క్షేత్రదర్శిని’కి బస్సుల ఏర్పాటు: ఆర్‌ఎం

100views

మార్గశిర మాసంలో పంచ వైష్ణవ క్షేత్రదర్శిని పేరుతో డిసెంబరు 7, 14, 21, 28 తేదీల్లో ద్వారకా బస్‌స్టేషన్‌ నుంచి రాత్రి 9 గంటలకు బస్సులు బయలుదేరుతాయన్నారువిశాఖపట్నం ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు. ద్వారకాతిరుమల (వెంకటేశ్వరస్వామి), అంతర్వేది (శ్రీలక్ష్మీ నరసింహస్వామి), అప్పనపల్లి (శ్రీబాలబాలాజీ), గొల్లల మామిడాడ (కోదండ రామాలయం), అన్నవరం (శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి) ఆలయాల దర్శనం తర్వాత నగరానికి చేరుకోవచ్చన్నారు. సూపర్‌ లగ్జరీ బస్సుల్లో టికెట్‌ ధర రూ.1,800లుగా నిర్ణయించినట్లు తెలిపారు. టికెట్లు ఆన్‌లైన్‌లో www.apsrtconline.in- ద్వారా, ద్వారకా బస్‌స్టేషన్‌లో పొందవచ్చని సూచించారు. ఇతర వివరాలకు 99592 25602, 90522 27083, 99592 25594, 91001 09731 నంబర్లలో సంప్రదించాలన్నారు.